ఎస్‌ఎల్‌బీసీ సహాయ కార్యక్రమాలకు రూ.5 కోట్లు మంజూరు

by Ramesh Goud |
ఎస్‌ఎల్‌బీసీ సహాయ కార్యక్రమాలకు రూ.5 కోట్లు మంజూరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ వద్ద గత నెల 22న జరిగిన ప్రమాదం నేపథ్యంలో సహాయక చర్యలను కొనసాగించేందుకు ప్రభుత్వం రూ.5 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) విభాగం ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ అభ్యర్థనను పరిశీలించిన అనంతరం ఆర్థిక విభాగం ఈ నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వం సూచించింది. నిధులను సమర్థంగా వినియోగించి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Next Story