- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గల్లీలో బీభత్సం సృష్టించిన కారు.. ఒకరికి గాయాలు..

దిశ, చండూరు : మద్యం మత్తులో ఓ యువకుడు హల్ చల్ చేసిన సంఘటన సోమవారం రాత్రి చండూరు మున్సిపల్ కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ రోడ్డులోని ఓ వైన్స్ సమీపంలో యువకుడు తన కారుతో దోమలపల్లి యాదమ్మ ను ఢీ కొట్టి వెళ్ళిపోతుండటంతో కొందరు యువకులు పట్టుకోవటానికి వెంబడించారు. దాంతో అతను తప్పించుకోవటానికి గ్రంథాలయం పక్కన సంతోష్ నగర్ కాలనీలోని ఇరుకైన గల్లీలోకి పోతూ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు.
కొద్ది దూరం పోయాక కారు పోవటానికి దారి లేక ఆగిపోవటంతో స్థానికులు అతనిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించగా వారు అతనిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇరుకైన గల్లీలో కారు అతివేగంగా పోతుండటంతో ఏం జరుగుతుందో తెలియక భయబ్రాంతులకు గురైనట్లు స్థానికులు తెలిపారు. కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేదని అతనిది ఏ ఊరు అని అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని స్థానికులు తెలిపారు. కాగా గాయపడిన మహిళను స్థానికంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీని పై పోలీస్ ల వివరణ కోరగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.