- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MegaStar Chiranjeevi: లండన్ చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి.. రేపే ఆ పురస్కారంతో సన్మానం?

MegaStar Chiranjeevi: లండన్ చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి.. రేపే ఆ పురస్కారంతో సన్మానం?
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ నటుడు ప్రస్తుతం కూడా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. వరుస సినిమాల్లో అవకాశం దక్కించుకుంటున్నాడు. ప్రజెంట్ మెగాస్టార్ విశ్వంభర (Vishvambhara) చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ (2025) మే 9 వ తారీకున విడుదల కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో మెగా అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. విశ్వంభర నుంచి ఏదో ఒక అప్డేట్ అందినప్పుడల్లా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు.
ఇక ఈ నటుడు కుక్క కాటుకు చెప్పుదెబ్బ, శ్రీరామబంటు (Sri Rama Bantu), ఆరని మంటలు, మోసగాడు, నకిలీ మనిషి, తాతయ్య ప్రేమలీలలు (Tathayya premalilalu), ప్రేమ తరంగాలు,లవ్ ఇన్ సింగపూర్, ప్రేమ నాటకం, రాణీకాసుల రంగమ్మ (Ranikasula Rangamma),చట్టానికి కళ్లు లేవు, బందిపోటు సింహం, కిరాయి రౌడీలు, తోడు దొంగలు,శంకర్‌దాదా జిందాబాద్ (Shankardada jindabad), సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్,భోళా శంకర్, వాల్తేరు వీరయ్య వంటి అనేక చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
అయితే నేడు మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్నారు. ఈ నటుడి సేవల్ని గుర్తిస్తూ.. సాంస్కృతిక నాయకత్వం ద్వారా ప్రజా సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు 2025 మార్చి 19న UK పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్(House of Commons)లో ఆయనకు 'జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నారు. దీంతో చిరు లండన్(London) చేరుకోగానే మెగా ఫ్యాన్స్ అంతా భారీగా తరలివచ్చారు. ఫ్లెక్లీలతో చిరంజీవికి స్వాగతం పలికారు. అలాగే చిరుతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.