సాంకేతిక యుగంలో మూఢనమ్మకాల ప్రభావం..

by Aamani |
సాంకేతిక యుగంలో మూఢనమ్మకాల ప్రభావం..
X

దిశ,మంథని : మనుషులు ప్రపంచంతో పోటీ పడుతున్న విషయం అందరికి తెలిసిందే.టెక్నాలజీ ప్రతి ఒక్కరి.. అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరి చేతిలో... స్మార్ట్ ఫోన్ లు కూడా ఉన్నాయి.అయినప్పటికీ నేటి సాంకేతిక యుగంలో మూఢనమ్మకాల ప్రభావం మాత్రం ఎక్కడో ఒక చోట కొనసాగుతుంది.మూఢ నమ్మకాలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం అలానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఇదే మంథని మండలం కాకర్ల పల్లి గ్రామం దగ్గర ఉన్న దంతనపల్లి గ్రామానికి కలిపే... రోడ్డు మూడు బజార్ల దగ్గర సోమవారం ఉదయం... కొబ్బరి కాయ,ఉల్లి గడ్డ, నిమ్మకాయ,ఎల్లిగడ్డ, కోడి గుడ్డు, పసుపు, కుంకుమ ముద్దలు దర్శనమిచ్చాయి.అటు వైపు నుండి టు వీలర్ వాహనం దారులు కాలి నడకన వెళ్లే వారు ఇది ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు.ఇది ఏంటిదని ఇక్కడ ఎవరో.. క్షుద్ర పూజలు చేశారని.. వాటి మీదకి నుండి దాటవద్దని... ఒక వేళ దాటితే.... మంచిది కాదని కాసేపు చెప్పుకుండడం విశేషం.

అక్కడ బుధ,గురు,ఆదివారాల్లో క్షుద్ర పూజలు..

అక్కడ బుధ,గురు,ఆదివారల్లో వస్తే చాలు ఎదో ఒక్క రకమైన పూజలు ప్రత్యేక్షమవుతుంటాయి. ఎందుకంటే... అసలే అది మూడు బజార్ల దారి అక్కడ పూజలు చేసే వారికీ అనుకూలంగా ఉండే స్థలం. అందుకే ఎదో రకంగా క్షుద్ర పూజలు.. చేస్తుంటారు.ఇప్పుడే కాదు.. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు... నెల పొడువునా... బుధ, గురు, ఆదివారాల్లో క్షుద్ర పూజలు దర్శనమిస్తుంటాయి.అటు వైపు వెళ్ళ్తున్న వారు... వాటిని దాటకుండా పక్క నుండి వెళ్ళుతుంటారు.మీద ఉన్న పీడ పోతుందానో... ఆరోగ్యంగా ఉంటామనో... ఇలా మూఢ నమ్మకాల పై విశ్వాసంతో చేస్తుంటారు.కాలం మారి సైన్స్ తో టెక్నాలజీతో మనిషి పోటీ పడి... చంద్రుడిపై మనిషి... జీవిస్తున్న... కూడా... ఏదో ఒక చోట.. ముఖ్యంగా గ్రామాల్లో మాత్రం ఇంకా మూఢ నమ్మకాలూ కొనసాగుతున్నాయి.ఏది ఏమైనా... మూఢ నమ్మకాలను విడాలని సైన్స్, టెక్నాలజీ తో పోటీ పడే విధంగా ముందు వెళ్లే అవసరం ఉందని పలువురు అనుకుంటున్నారు.

Next Story

Most Viewed