- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
China: లడఖ్ భూభాగంలో చైనా కౌంటీలు.. ఆక్రమణలు ఆమోదయోగ్యం కాదన్న భారత్

దిశ, నేషనల్ బ్యూరో: సరిహద్దుల్లో చైనా మరోసారి ఆక్రమణకు పాల్పడింది. లడఖ్(Ladakh) భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో రెండు కౌంటీలను ఏర్పాటుచేస్తోంది. కాగా.. ఇలాంటి ఆక్రమణను ఎన్నటికీ అంగీకరించబోమని.. ఇప్పటికే నిరసనను దౌత్యమార్గాల ద్వారా తెలిపామని కేంద్రం వెల్లడించింది. చైనా కౌంటీల నిర్మాణంపై కేంద్రానికి సమాచారం ఉందా?అన్న ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ‘‘చైనా రెండు కొత్త కౌంటీలను (China counties in Ladakh) ఏర్పాటుచేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఆ కౌంటీల్లోని కొన్ని భాగాలు లడఖ్ పరిధిలోకి వస్తాయి. భారత భూభాగాలను ఆక్రమించడాన్ని మేం ఎన్నటికీ అంగీకరించబోం. భారత సార్వభౌమాధికారానికి సంబంధించి మా దీర్ఘకాల, స్థిరమైన వైఖరిపై ఈ కౌంటీల ఏర్పాటు ఎలాంటి ప్రభావం చూపించదు. ఈ చర్యలు.. చైనా చేపడుతున్న బలవంతపు ఆక్రమణలకు చట్టబద్ధతను కల్పించలేవు’’ అని కీర్తివర్ధన్ సింగ్ పార్లమెంట్‌కు వెల్లడించారు.
అభివృద్ధి ప్రాజెక్టులపైనా సమాచారం
కౌంటీలతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా తమకు సమాచారం ఉందని కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. భారత వ్యూహాత్మక, భద్రతా అవసరాలకు అనుగుణంగా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల పురోగతిపై భారత్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందుకోసం గత దశబ్ద కాలంలో బడ్జెట్ కేటాయింపులనుక కూడా పెంచామన్నారు. సరిహద్దు రవాణా వ్యవస్థకుక గతంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా నిధులు అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా, బ్రిడ్జిలు, సొరంగాలు కూడా నిర్మిస్తున్నామన్నారు.