- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Goli Soda: భారత గోలీ సోడాకు యూఎస్, యూరప్, గల్ఫ్ దేశాల్లో భారీ డిమాండ్

దిశ, బిజినెస్ బ్యూరో: భారత చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గోలీ సోడా మరోసారి అందరి ఆదరణనను పొందుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ఈ సాంప్రదాయ డ్రింక్‌కు అధిక డిమాండ్ ఏర్పడినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ విభాగం వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి అథారిటీ(ఏపీఈడీఏ) తెలిపింది. దేశీయ వ్యాపారస్తులు అనుసరించిన వ్యూహాత్మక విస్తరణ, రీడిజైన్ కారణంగా అమెరికా, యూకే, యూరప్, గల్ఫ్ సహా కీలక అంతర్జాతీయ మార్కెట్లలో గోలీ సోడాకు స్పందన గణనీయంగా పెరిగింది. ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్‌తో భాగస్వామ్యం ద్వారా ప్రముఖ సూపర్‌మార్కెట్ లులు హైపర్‌మార్కెట్ గల్ఫ్ ప్రాంతంలో గోలీ పాప్ సోడాగా రీబ్రాండ్‌తో విక్రయాలను నిర్వహిస్తోంది. ఒకప్పుడు భారతీయ ఇళ్లలో సరవసాధారణమైన గోలీ సోడా, కొత్త బ్రాండింగ్, విస్తరణ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2020 తర్వాత నుంచి వీటిని అత్యధిక డిమాండ్ ఏర్పాడిందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా గోలీ సోడా వ్యాపార ఆదాయం 10 రెట్లు పెరుగుతోందని, యూఏఈ, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో ఇప్పటికే అనేక ఔట్‌లెట్‌లు ప్రారంభమయ్యాయని ఏపీఈడీఏ వివరించింది. అనేక దిగ్గజ కూల్‌డ్రింక్ బ్రాండ్ల కారణంగా దాదాపు కనుమరుగైన గోలీ సోడా తిరిగి ఆదరణ పొందడం, దేశీయంగా తయారీకి, ఎగుమతులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇదొక మైలురాయిని సూచిస్తుందని ఏపీఈడీఏ పేర్కొంది.