- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అలర్ట్.. రేపు పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు
by Jakkula Mamatha |

X
దిశ, సామర్లకోట: కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పరిధిలోని సామర్లకోట రైల్వే ఇంజనీరింగ్ సెక్షన్ పరిధిలో సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, రావికంపాడు స్టేషన్ల మధ్య సిగ్నలింగ్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా రేపు(సోమవారం) పలు రైళ్లను రద్దయినట్లు స్టేషన్ మాస్టర్ రమేష్ తెలిపారు. ఉదయ్, సింహాద్రి ఎక్స్ప్రెస్ తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే పీఆర్వో కార్యాలయం తెలిపిందన్నారు. గుంటూరు నుంచి విశాఖ వెళ్లే సింహాద్రి ఎక్స్ప్రెస్, కాకినాడ విశాఖపట్నం, రాజమండ్రి విశాఖపట్నం మధ్య నడిచే మరో నాలుగు రైళ్లు సింహాద్రి, ఉదయ్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఈనెల 24 తేదీన రెండువైపులా రద్దు చేశారని, ప్రయాణికులు గమనించాలని స్టేషన్ మేనేజర్ రమేష్ తెలిపారు.
Next Story