Mahesh Babu-sitara: ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు, సితార.. వావ్, సూపర్ అంటూ నెట్టింట ప్రశంసల జల్లు

by Hamsa |   ( Updated:2025-03-22 07:30:44.0  )
Mahesh Babu-sitara: ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు, సితార.. వావ్, సూపర్ అంటూ నెట్టింట ప్రశంసల జల్లు
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) గత ఏడాది ‘గుంటూరు కారం’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో హిట్ అందుకోనప్పటికీ బాక్సాఫీసు వద్ద మెప్పించింది. ప్రస్తుతం మహేష్ బాబు ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి (Rajamouli)కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘SSMB-29’. ఇందులో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు తెగ కష్టపడిపోతున్నాడు. గత కొద్ది కాలంగా సోషల్ మీడియాకు కూడా దూరం అయిపోయారు.

తన మేకోవర్ కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన లుక్ బయటపడకుండా ఎలాంటి ఈవెంట్‌కు కూడా వెళ్లడం లేదు. దీంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక మహేష్ బాబు లుక్, ‘SSMB-29’ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, మహేష్ బాబు ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన గారాలపట్టి సితార(Sitara)తో కలిసి ట్రెండ్స్ యాడ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అయితే ఇందులో మహేష్ బాబు షాకింగ్‌కు వెళ్లి బట్టలు తెచ్చుకోగా.. ఎంజాయ్ చేసావుగా అని అడగ్గా.. సితార అవును అని సమాధానమిస్తుంది. సడెన్‌గా బ్లాక్ కలర్ డ్రెస్ తండ్రి మీదకు విసిరేస్తుంది. దీంతో సూపర్ స్టార్ బెదిరిపోతాడు. ఇక వెంటనే కూతురిపైకి ఓ ఫ్రాక్ విసిరేస్తాడు. అలా ఇద్దరు పలు డ్రెస్‌లు వేసుకుంటారు. ఈ వీడియో అందరినీ ఫిదా చేస్తోంది. ఇద్దరు స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్, సూపర్ ఒకే ఫ్రేమ్‌లో తండ్రీ కూతురు అదిరిపోయారు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More..

‘SSMB-29’లో మలయాళ నటుడు.. ఇందులో ఏడాది క్రితమే భాగమయ్యానంటూ ఆసక్తికర కామెంట్స్

Next Story

Most Viewed