‘నేను ఏ తప్పూ చేయలేదు - ఎక్కడికీ పారిపోలేదు’.. హైకోర్టులో ప్రభాకర్ రావు సంచలన పిటిషన్

by Gantepaka Srikanth |
‘నేను ఏ తప్పూ చేయలేదు - ఎక్కడికీ పారిపోలేదు’.. హైకోర్టులో ప్రభాకర్ రావు సంచలన పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(SIB) మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు(Prabhakar Rao) హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం తాను క్యాన్సర్‌, లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నానని.. చికిత్స కోసమే అమెరికాకు వచ్చానని పిటిషన్‌లో ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను నిందితుడిగా చేర్చడానికి ముందే అమెరికాకు వచ్చానని వెల్లడించారు. అసలే విషయం తెలుసుకోకుండా.. నేరుగా తనపై నిందితుడు అని ముద్ర వేయడం కరెక్ట్ కాదని ఆవేదన చెందారు. తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదని అన్నారు. కాగా, గతేదాడి మార్చి 10వ తేదీన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై కేసు నమోదైంది. ప్రధాన నిందితుడిగా చేరుస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

కాగా, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పైనా ప్రభాకర్ రావు కీలక ఆరోపణలు చేశారు. కొత్త ప్రభుత్వం కుట్రపూరితంగానే తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిందని.. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదని పేర్కొన్నారు. ఎస్‌ఐబీ చీఫ్‌(SIB Chief)గా నిబద్ధతతో పని చేశానని, అధికారిక పార్టీతో కుమ్మక్కై ఇతర పార్టీలకు చెందిన వారి ఫోన్‌లను ట్యాప్‌ చేయించాననడం తప్పుడు ఆరోపణ అని పేర్కొన్నారు. అమెరికా వెళ్లినా దర్యాప్తు అధికారితో సంప్రదిస్తూనే ఉన్నానని అన్నారు.

Next Story

Most Viewed