- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లిదండ్రులైన తమన్నా- విజయ్ వర్మ!.. షాక్‌లో నెటిజన్లు

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannah Bhatia)అందరికీ సుపరిచితమే. ‘శ్రీ’ మూవీతో వచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించిన ఆమె తన అందం, నటనతో ఎంతో మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. మరీ ముఖ్యంగా గ్లామర్ డోస్ పెంచడంతో పాటు లిప్ లాక్ బెడ్ రూమ్ సీన్స్ చేస్తూ రెచ్చిపోతుంది. వాటిని చూసిన వారంతా అవన్నీ చేస్తోంది తమన్నా కాదా అనే అనుమానపడుతున్నారు. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. మిల్కీ బ్యూటీ గత కొద్ది రోజులనుంచి నటుడు విజయ్ వర్మ(Vijay Verma)తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
కానీ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. నిత్యం పలు వెకేషన్స్‌కు వెళ్తూ ఫొటోలు షేర్ చేస్తున్నారు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయారని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఓ నటి కూతురు తమన్నా, విజయ్ వర్మ తనకు దేవుడిచ్చిన తల్లిదండ్రులంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు విషయంలోకి వెళితే.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవీనా టాండన్(Raveena Tandon) కూతురు రాషా ఆసక్తికర కామెంట్స్ చేసింది.
‘‘నేను ఓ బర్త్ డే పార్టీకి వెళ్లాను. అక్కడ తమన్నా కూడా ఉంది. ఓ సింగర్ పాడుతుండగా మేము డ్యాన్స్ చేశాం. అప్పుడే మా మధ్య పరిచయం ఏర్పడింది. చాలా త్వరగానే క్లోజ్ అయిపోయాం. తను లేకపోతే ఏం చేయాలో కూడా తోచదు. తమన్నా, విజయ్ వర్మ నాకు చాలా క్లోజ్ అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే దేవుడిచ్చిన పేరెంట్స్ అయ్యారు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాషా కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.