కూలి పనికి వెళ్లి వచ్చేసరికి భార్య మిస్సింగ్​

by Sridhar Babu |
కూలి పనికి వెళ్లి వచ్చేసరికి భార్య మిస్సింగ్​
X

దిశ,మేడ్చల్ టౌన్ : ఓ మహిళ అదృశ్యం అయిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రం త్రిలోకి చెందిన సౌరబ్ మెహర తన భార్య సంగీత పటేల్(24) తో కలిసి మేడ్చల్ లో నివాసముంటున్నాడు. ఈనెల 24వ తేదీన సౌరబ్ మెహర ఉదయం కూలి పనులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి తన భార్య సంగీత పటేల్ ఇంట్లో లేదు. దీంతో పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. సంగీత పటేల్ ఆచూకీ తెలిస్తే మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 9490617160 కు సమాచారం అందించాలని కోరారు.

Next Story

Most Viewed