- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భూ భారతితో సమస్యలకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

దిశ, బీర్ పూర్ : రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం 2025 పై అవగాహన సదస్సును జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ సత్య ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూభారతి అమల్లోకి వచ్చిందని, ముందుగా రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని, రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
అనంతరం మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల విలువగల చెక్కులను, ఏడుగురు ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన ఏడు లక్షల రూపాయలు విలువగల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, కేడీసీసీ జిల్లా మెంబర్ రామచంద్రరావు, ఫ్యాక్స్ చైర్మన్ నవీన్ రావు, ఎమ్మార్వో ముంతాజి బుద్ధిన్, ఎంపీడీవో లచ్చాలు, ఆర్ఐ శ్రీనివాస్, రాహుల్, అధికారులు తాజా మాజీ ప్రతినిధులు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.