- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అలంకారప్రాయంగా ఏనుకూరు లిఫ్ట్ ఇరిగేషన్..

దిశ, ఏన్కూర్ : రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు అని అనేక సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు, రైతుల సాగు కోసం ఏర్పాటు చేసిన లిఫ్టు స్కీము పనిచేసే విధంగా చూడాలి, ఏనుకూరు సాగర్ ఆయకట్టు పక్కన ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ఏన్కూర్ లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును ఏర్పాటు చేశారు. ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిధులు వెచ్చించి లిఫ్ట్ ఏర్పాటు చేస్తే, ఆనాటి నుండి నేటి వరకు ఈ లిఫ్ట్ ద్వారా ఎకరం పొలం తడిసిన పాపాన పొలేదు, ప్రధానంగా ఏనుకూరు చెరువుకు అనుసంధానంగా ఈ లిఫ్ట్ స్కీమ్ ను ఏర్పాటు చేశారు. పక్కనే సాగర్ కాలవ జలాలు పై ప్రాంతానికి వెళ్తున్న సందర్భంలో లిఫ్ట్ మోటారు ఆన్ చేస్తే ఏనుకూరు చెరువుకు సాగర్ జలాలు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏనుకూరు చెరువులో నీళ్లు అడుగంటడంతో పశువులకు రానున్న రోజుల్లో త్రాగునీరు కష్టతరంగా నున్నది, కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ లిఫ్ట్ స్కీం గురించి ఇరిగేషన్ అధికారులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారు అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఏనుకూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పని చేస్తే ఏనుకూరుతో పాటు టీఎల్ పేట రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ లిఫ్ట్ స్కీము డిజైన్ చేసే సమయంలో గిరిజన ప్రాంతమైన భగవాన్ నాయక్ తండా ప్రాంత రైతులకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేయాలని ఆ ప్రాంత రైతులు కోరారు. అలాంటి చర్యలు ఏమి చేపట్టని ఇరిగేషన్ అధికారులు. ప్రస్తుతం చెరువు ఆయకట్టు కింద ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు లిఫ్ట్ స్కీమును ప్రారంభించాలని, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఈ లిఫ్ట్ ఏర్పాటు చేసిందో ఆ స్కీము రైతులకు ఉపయోగపడే విధంగా జిల్లా మంత్రివర్యులు చొరవ తీసుకొని ఇరిగేషన్ అధికారులకు సూచించి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.