Ram Charan: ‘ఆర్ సీ-16’ టైటిల్ ఫిక్స్..? ఆకట్టుకుంటున్న పోస్టర్..

by Kavitha |   ( Updated:2025-03-23 04:51:21.0  )
Ram Charan: ‘ఆర్ సీ-16’ టైటిల్ ఫిక్స్..? ఆకట్టుకుంటున్న పోస్టర్..
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ సీ-16’(RC-16) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి ఎ ఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తుండగా.. స్టార్ యాక్టర్ జగపతి బాబు(Jagapathi babu), శివరాజ్ కుమార్(Shivaraj Kumar), దివ్వేంద్(Devend) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేస్తున్నారు.

అయితే ఈ సినిమాను భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా రీసెంట్‌గా శివన్న కూడా షూటింగ్ జాయిన్ అయినట్లు మూవీ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ న్యూ లుక్‌లో కనిపించబోతున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ టైటిల్ ఫిక్స్ అయినట్లు ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఆర్ సీ-16 మూవీకి ‘పెద్ది’(Peddi) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.




Next Story