మరోసారి ఆ టాలీవుడ్ యంగ్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న అనుపమ.. ఇది కూడా పక్కా బ్లాక్ బస్టరే అంటున్న ఫ్యాన్స్

by Kavitha |
మరోసారి ఆ టాలీవుడ్ యంగ్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న అనుపమ.. ఇది కూడా పక్కా బ్లాక్ బస్టరే అంటున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) నటించిన ‘అఆ’(A AA) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మనుపెన్నడు కనిపించని గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్లును ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక రీసెంట్‌గా ‘డ్రాగన్’(Dragon) మూవీతో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’(JSK), ‘పరదా’(Paradha) వంటి సినిమాలు ఉన్నాయి.

అలాగే ‘పరదా’ లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతుంది. దీనికి ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో అనుపమ పరమేశ్వరన్, మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్(Darshana Rajendran), సీనియర్ నటి సంగీత(Sangeetha) ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అయితే J.S.K మూవీకి ప్రవీణ్ నారాయణ(Praveen Narayana) దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కాస్మోన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై జె ఫణీంద్ర కుమార్(J. Phanindra Kumar) నిర్మిస్తున్నారు.

అలా ఓ పక్క వరుస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(social Media)లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో, వ్యక్తిగత విషయాలతో ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా అనుపమ ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇందులో భాగంగా మరోసారి ఈ యంగ్ హీరోతో రొమాన్స్ చేయబోతుందట. సంచలన దర్శకుడు సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వంలో శర్వానంద్(Sharwanand), అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్లు సమాచారం.

ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతంలో 'శతమానం భవతి' సినిమాతో మొదటిసారి జోడీ కట్టిన శర్వానంద్, అనుపమ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించనున్నారు. ప్రస్తుతం సంపత్ నంది తన 'ఓదెల 2' చిత్రాన్ని పూర్తి చేశాడు. ఇక నెక్స్ట్ శర్వానంద్, అనుపమ మూవీ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed