- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Assembly: ఆ విషయంపై రాజకీయం చేయొద్దు.. ప్రభాకర్ రెడ్డికి మంత్రి సీతక్క కౌంటర్

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక (Dubbaka) నియోకవర్గంలోని బీసీ హాస్టల్‌లో ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడని ఎమ్మెల్యే ప్రభాక రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లో డైట్ చార్జీలు (Diet Charges), కాస్మొటిక్ చార్జీల (Cosmetic Charges)పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి గత రెండు రోజులుగా కోమాలోనే ఉన్నాడని పేర్కొన్నారు. ఈ వార్త ఎక్కడా బయటకు రాకుండా తొక్కి పెట్టారని ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy) సభలో ఫైర్ అయ్యారు.
ఈ క్రమంలోనే విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై మంత్రి సీతక్క (Minister Seethakka) ప్రభాకర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. అది ప్రభుత్వానికి ఆపాదించొద్దని ఫైర్ అయ్యారు. ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థికి నీలోఫర్ ఆసుపత్రి (Nilofer Hospital)లో వైద్యులు చికిత్స అందజేస్తున్నారని తెలిపారు. తమ హయాంలో హస్టళ్లు బాగున్నాయని.. ఇప్పుడు బాగోలేవని బీఆర్ఎస్ (BRS) రాజకీయం చేయొద్దని హితవు పలికారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో మొత్తం 114 మంది గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని.. ఆ విషయంలో బీఆర్ఎస్ పెద్దలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. విద్యార్థి ఆత్మహత్యకు తొక్కి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేనే లేదని అన్నారు. దుబ్బాక (Dubbaka) హాస్టల్ విద్యార్థి ఘటనలో నివేదికను తెప్పించుకుని సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.