- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘పది’ నిమిషాలు ఆలస్యం.. పరీక్షకు దూరం..

దిశ, ఊట్కూర్ : ఎస్ఎస్సీ పరీక్షలు ఆరంభమైన ఐదు నిమిషాల వరకు ఆలస్యమైనప్పటికీ అనుమతి ఇస్తాం.. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు అని అధికారులు విస్తృత ప్రచారం చేసినప్పటికి ఒక విద్యార్థి.. 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చి అధికారులు సెంటర్ లోకి అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి వెళ్ళాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఉర్దూ మీడియం లో పదవ తరగతి చదివిన విద్యార్థి మహమ్మద్ ఉమర్ శుక్రవారం ఉదయం ఆరంభం అయిన పరీక్షా కేంద్రానికి వ్యక్తిగత కారణాలవల్ల పది నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు.
అప్పటికే సమయం ముగిసి పరీక్షలు ఆరంభం కావడంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు. విద్యార్థి సంబంధిత అధికారులను రిక్వెస్ట్ చేసిన ప్రయోజనం లేకపోయింది. సంబంధిత అధికారులు ఉన్నత అధికారులతో మాట్లాడగా నిబంధనలను ఉల్లంఘించరాదని చెప్పడంతో.. పరీక్షా కేంద్రం అధికారులు ఆ విద్యార్థికి పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ విద్యార్థి నిరాశగా వెనుదిరిగాడు. ఈ విషయమై సంబంధిత ఉన్నత అధికారులను సంప్రదించగా విద్యార్థి ఏకంగా అరగంట ఆలస్యంగా వచ్చాడు. కాబట్టి అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.