TG Assembly: చేతకాని వారెవరు.. మాట తప్పిందెవరు: అసెంబ్లీలో హరీశ్ రావు ఫైర్

by Shiva |
TG Assembly: చేతకాని వారెవరు.. మాట తప్పిందెవరు: అసెంబ్లీలో హరీశ్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏడో రోజు అసెంబ్లీ (Assembly) సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై విపక్ష సభ్యుడు హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ.. బడ్జెట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) బాగా నీతులు చెప్పారని.. గతేడాది బడ్జెట్‌తో పోలుస్తూ ఆధికార పార్టీపై ఫైర్ అయ్యారు. గతడాది అంచనాలు పెంచి చూపించారని.. ఇప్పుడు బడ్జెట్ అంచనాలను తగ్గించారని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ (Congres Party) ఇచ్చిన హామీలపై ఆయన నిలదీశారు.

ప్రతిపక్షంలో ఉన్న నాడు ఇదే పార్టీ ఎల్ఆర్ఎస్ (LRS) వద్దని ఆర్భాటం చేసిందని.. అధికారంలోకి రాగానే LRS పేరిట ప్రజల ముక్కు పిండి పైకం వసూలు చేస్తున్నా్రని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారని .. ఈ బడ్జెట్‌లో కేవలం రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లుగా చూపించారని అన్నారు. ఈ క్రమంలోనే చేతకాని వారెవరు.. మాట తప్పిందెవరు అంటూ కామెంట్ చేశారు. రైతు భరోసా పథకం పేరు మార్చేశారు కానీ.. డబ్బులు ఇవ్వలేని అన్నారు. కౌలు రౌతులకు రైతు బీమా, వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని తెలిపారు.

Advertisement
Next Story

Most Viewed