- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎస్సారెస్పీ కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
by Aamani |

X
దిశ, హుజరాబాద్ రూరల్: హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి ఎస్సారెస్పీ మెయిన్ కాలువలో బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని శవం లభ్యమైంది. రోడ్డు వెంట వెళ్లేవారు గుర్తించి శవానికి తాడు కట్టి నిలిపివేశారు. స్థానికుల కథనం మేరకు.. దాదాపు 50 సంవత్సరాలు గల వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. మృత దేహానికి తెల్లటి బనీను ఉంది. నిన్న మృతుడు మానకొండూరు మండలం సమీపంలో ప్రమాదవశాత్తు కాలువలో పడ్డట్టు ప్రచారం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story