నిందితుల కోసం పోలీసులు ఎన్‌కౌంటర్.. ఒకరు మృతి

by Mahesh |   ( Updated:2025-03-17 11:54:30.0  )
నిందితుల కోసం పోలీసులు ఎన్‌కౌంటర్.. ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రాజసాన్సి ప్రాంతంలోని దేవాలయంపై గ్రెనేడ్ దాడికి (Grenade attack) పాల్పడిన నిందిుతులు అయిన గుర్సిదాక్, విశాల్‌లను పట్టుకొవడానికి ఈ రోజు ఉదయం పోలీసులు ఎన్ కౌంటర్ (Police encounter) నిర్వహించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో బుల్లెట్ తగిలి నిందితుడు గుర్సిదాక్ (Accused Gursidak) మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. SHO ఛెహర్తా ప్రకారం.. నిన్న గ్రానేడ్ దాడికి పాల్పడిన నిందితుడు బైక్ పై వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నిందితుడు.. బైక్ పై నుంచి కిందకు దూకి.. పోలీసులపై తన వద్ద ఉన్న తుపాకితో కాల్పులు (Gunfire) జరిపాడు. దీంతో "ఒక బుల్లెట్ కానిస్టేబుల్ గురుప్రీత్ సింగ్ ఎడమ చేతికి తగిలింది, ఒక బుల్లెట్ ఇన్‌స్పెక్టర్ అమోలక్ సింగ్ తలపాగాను తాకింది. అలాగే మరో ఒక బుల్లెట్ పోలీసు వాహనాన్ని తాకింది.

ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్ (Inspector Vinod Kumar) నిందితుడి నుంచి తమ ఆత్మరక్షణ కోసం తన పిస్టల్‌తో కాల్పులు జరపడంతో నిందితుడు గుర్సిదాక్ (Accused Gursidak) గాయపడ్డాడు. అలాగే బైక్ పై ఉన్న నిందితులు అక్కడి నుండి పారిపోయారు. HC గుర్ప్రీత్ సింగ్, గుర్సిదాక్‌లను చికిత్స కోసం సివిల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా నిందితుడు గుర్సిదాక్ తీవ్ర గాయాల కారణంగా మరణించాడు. ఈ సంఘటనపై పోలీస్ స్టేషన్ లో FIR నమోదు అయిందని అని పోలీసులు తెలిపారు. కాగా అమృత్ సర్ లోని ఓ గుడిపై శుక్రవారం రాత్రి ఇద్దరు వ్య‌క్తులు బైక్‌పై వ‌చ్చి హ్యాండ్ గ్రేనేడ్ విసిరారు. ఈ దాడికి ఘటన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అవ్వగా.. దీని ఆధారంగా చేసుకొని పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story

Most Viewed