- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దొంగతనానికి పోయి ప్రాణం మీదకు తెచ్చుకునే...

దిశ, కోదాడ : చర్చిలో దొంగతనానికి పోయి ఓ దొంగ ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. కోదాడ పట్టణ సీఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న హోరేబు ప్రార్ధనా మందిరంలోకి అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి మందిరానికి అమర్చేందుకు తీసుకువచ్చిన కొత్త కిటికీలు, డోర్ ను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో మందిరానికి కాపలాదారులుగా ఉన్న నారాయణ, తమటం జయరాంలు వ్యక్తిని పట్టుకున్నారు.
ప్లాస్టిక్ పైపుతో కొట్టి, కాళ్ళు చేతులు కట్టేసి కొంత సేపు ఉంచిన అనంతరం తెల్లవారుజామున పోలీసులకు అప్పగించాలనే ఉద్దేశంతో అతని కట్లు విప్పారు. అదే అదునుగా దొంగ పారిపోయే ప్రయత్నంలో బాత్రూమ్ వెనుక ఉన్న గోడ దూకి అవతల ఉన్న రాళ్ల పై పడి అక్కడే అపస్మారక స్తితికి వెళ్ళాడు. వెంటనే అతడిని అంబులెన్స్ లో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అతని పరిస్తితి విషమంగా ఉండటంతో సూర్యపేట జిల్లా ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిపారు. హోరేబు ప్రార్ధనా మందిరం నిర్మాణం చేయిస్తున్న శేషం జోసెఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణ , తమటం జయరాం లపై కేసు నమోదు చేసినట్లుగా సీఐ తెలిపారు.