- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శంషాబాద్ లో ఆ పని చేస్తూ దొరికిపోయిన వ్యక్తి..

దిశ శంషాబాద్: గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తుండగా పోలీసులు వలపర్ని పట్టుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ సినిమా థియేటర్ వద్ద వ్యక్తి డ్రగ్స్ విక్రయిస్తున్నాడని సమాచారం రావడంతో.. పోలీసులు బలపని పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా.. మహారాష్ట్రకు చెందిన అభిషేక్ బెంగళూరు నుండి డ్రగ్స్ తీసుకువచ్చి గత కొన్ని రోజులుగా శంషాబాద్ లో విక్రయిస్తున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది. డ్రగ్స్ విక్రయిస్తున్న అభిషేక్ అనే వ్యక్తి ఒక్కడే ఉన్నాడా ..లేక ఇతనితో పాటు మరి కొంతమంది ఉన్నారా.. అనే కోణంలో వ్యక్తిని అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. అలాగే స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను క్లూస్ టీం, రెవెన్యూ బృందం పరిశీలించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితుడు అభిషేక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితులు వద్ద స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ఎంత మొత్తంలో ఉందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.