నేడు మచిలీపట్నంలో కేంద్రబృందం పర్యటన.. రూట్ మ్యాప్ ఇదే..!

by srinivas |
నేడు మచిలీపట్నంలో కేంద్రబృందం పర్యటన.. రూట్ మ్యాప్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో కృష్ణా జిల్లాలో అపారనష్టం జరిగింది. దీంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రబృందం నేడు జిల్లాలో పర్యటించనుంది. ఈ మేరకు బృందం అధికారులు మచిలీపట్నం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. తొలుత తాడేపల్లి ఏపీఎస్డీఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మధ్యాహ్నం ఒంటి గంటకు పరిశీలిస్తారు. పెనమలూరు మండలం యనమలకుదురులో వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఆర్‌డబ్ల్యూఎస్ పథకాలను 2.30 గంటలకు సందర్శించనున్నారు. పెదపులిపాక పరిధిలో నష్టపోయిన ఇళ్లు, ఉద్యానవన పంటలను పరిశీలిచనున్నారు. అనంతరం చోడవరం, కంకిపాడు, మద్దూరులో దెబ్బతిన్న పంటలు పరిశీలిస్తారు. ఆ తర్వాత వరదలతో కొట్టుకుపోయిన రొయ్యూరు-కంకిపాడు రోడ్డును పరిశీలించనున్నారు. అనంతరం పామర్రు, గుడివాడ, నదివాడ మండలాల్లోని ముందపు ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో కేంద్రబృందం అధికారులు పర్యటించనున్నారు. ఈ పర్యటన అనంతరం విజయవాడకు బయల్దేరి వెళ్లనున్నారు.

Advertisement

Next Story

Most Viewed