Hiccups: ఎక్కిళ్లు ఎంతకీ ఆగట్లేదా..? ఇలా చేస్తే క్షణాల్లో తగ్గిపోతాయ్!

by Javid Pasha |
Hiccups: ఎక్కిళ్లు ఎంతకీ ఆగట్లేదా..? ఇలా చేస్తే క్షణాల్లో తగ్గిపోతాయ్!
X

దిశ, ఫీచర్స్ : ప్రశాంతంగా కూర్చొని ఉంటాం.. అంతలోనే ఒక ఉలికి పాటు.. ఆగకుండా ఎక్కిళ్లు వస్తూనే ఉంటాయి. ఏం చేయాలో తోచదు. కొన్నిసార్లు అవి ఆగకపోతే ఏదో జరుగుతుందనే భయం కూడా వేస్తుంది. నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకున్నప్పుడు, వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమైనప్పుడు.. ఎప్పుడైనా రావచ్చు. కానీ హఠాత్తుగా వస్తాయి. తగినంతగా నీళ్లు తాగకపోవడం, ఫాస్ట్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా వస్తుంటాయని, మరికొన్ని సార్లు ఎందుకు వస్తాయో కూడా చెప్పలేమని నిపుణులు అంటున్నారు. అయితే వచ్చినప్పుడు వెంటనే ఆపడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

*ఎక్కిళ్లు ఎక్కువగా వస్తుంటే నీళ్లు తాగితే కొన్నిసార్లు తగ్గిపోవచ్చు. ఎక్కువగా వస్తే తగ్గకపోవచ్చు కూడా. ఆ సమయంలో దీర్ఘంగా శ్వాస పీల్చుకొని కొన్ని క్షణాలు ఊపిరి బిగపట్టాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస వదలాలి. ఈ టెక్నిక్ ద్వారా ఎక్కిళ్లు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు. అలాగే రెండు చెవులను అరచేతులతో గట్టిగా కప్పేసినట్టు నొక్కుతూ శ్వాసన బిగపట్టుకోవడానికి ప్రయత్నించినా ఎక్కిళ్లు ఆగిపోయే అవకాశం ఉంది.

* ఎక్కిళ్లు ప్రారంభం అయినప్పుడు ఏదైనా తింటే గొంతులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సందర్భంలో ఓ స్పూన్ వెన్నలో చిటికెడు చక్కెర కలుపుకొని తింటే ఎక్కిళ్లు తగ్గుతాయంటున్నారు నిపుణులు. అందుబాటులో ఉంటే ఓ చిన్న నిమ్మకాయ ముక్కను నోటిలో వేసుకున్నా వెక్కిళ్లు తగ్గుతాయట. ఇందులోని పుల్లని రుచి మౌత్ డయాఫ్రమ్ కండరాలను ప్రేరేపించడం ద్వారా ఎక్కిళ్లు ఆగిపోతాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Read More...

Mind Detoxification : మిమ్మల్ని మీరే మార్చుకునే ‘మైండ్ డిటాక్సిఫికేషన్’.. ఆ సందర్భంలో అలా చేస్తూ..!

Advertisement

Next Story

Most Viewed