అసలు వ్యక్తి కి బదులు పరీక్ష రాసిన కేసులో యువతికి జైలు శిక్ష

by Sridhar Babu |
అసలు వ్యక్తి కి బదులు పరీక్ష రాసిన కేసులో యువతికి  జైలు శిక్ష
X

దిశ, కొత్తగూడెం : అసలు వ్యక్తికి బదులు 10వ తరగతి పరీక్షలు రాసిన కేసులో యువతికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ మంగళవారం తీర్పు చెప్పారు. కొత్తగూడెం పట్టణానికి చెందిన నీరుకొండ షాహాజీ బాబు పదవ తరగతి రాంనగర్ కు చెందిన ఓ సెంటర్ లో ఇన్​స్పెక్షన్​ చేస్తుండగా రాచబంటి శేషమణికి బదులు ఈ. అనూష అనే బాలిక పరీక్ష రాస్తున్నట్టు గుర్తించారు.

దాంతో కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్​లో 2016 మార్చి 31న ఫిర్యాదు చేశారు. అప్పటి సర్కిల్ ఇన్​స్పెక్టర్​ ఆర్.శ్రీనివాస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్​షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం రాచబంటి శేషమణిపై నేరం రుజువు కాగా మూడు సంవత్సరాలు జైలు శిక్ష, ఐదువేల రూపాయల జరిమానా, మరో సెక్షన్ ప్రకారం ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్​ను విశ్వశాంతి నిర్వహించారు. కోర్టు లైజాన్ ఆఫీసర్ మహమ్మద్ అబ్దుల్ ఘని (కోర్టు డ్యూటీ ఆఫీసర్), చుంచుపల్లి కోర్టు పీసీ రామకృష్ణ సహకరించారు.

Advertisement

Next Story

Most Viewed