ప‌వ‌న్‌పైనే ఆశలన్నీ.. శాశ్వత ప‌రిష్కారం చూపుతారా..!

by srinivas |
ప‌వ‌న్‌పైనే ఆశలన్నీ.. శాశ్వత ప‌రిష్కారం చూపుతారా..!
X

దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి/Pithapuram: గత అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లుమార్లు గొల్లప్రోలు ముంపుపై ప్రసంగించారు. దీనిపై సోమ‌, మంగళవారం రెండు రోజుల పాటు క‌లెక్టర్‌, అధికారుల‌తో ఆయ‌న ప్రత్యేకంగా స‌మీక్షించారు. ఈ నేప‌థ్యంలో ఏలేరు ద్వారా గొల్లప్రోలు ముంపుపై ప‌వ‌న్ తీసుకునే నిర్ణయం ఏలా ఉండబోతుందోన‌న్న ఆశ గొల్లప్రోలు వాసుల్లో ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌టం, ఏలేరు ప్రభావిత ప్రాంతాలు ఇక్కడే ఉండ‌టంతో ప‌వ‌న్ ఏలేరు ప‌వ‌న్‌పైనే ఆశలన్నీ.. శాశ్వత ప‌రిష్కారం చూపుతారా..! ప్రయ‌త్నిస్తారా లేదా అనే చర్చ మొదలైంది.

ఎక్కువ నష్టపోయేది గొల్లప్రోలే..

ఏలేరు ప్రాజెక్టు నుంచి విడుద‌లైన నీరు ఐదు మండ‌లాల‌ను దాటుకుంటూ ప‌ల్లపు ప్రాంత‌మైన గొల్లప్రోలుకు చేరుకుంటుంది. ఇది స‌ముద్రానికి ద‌గ్గర‌గా ఉన్న ప్రాంతం. గొల్లప్రోలు త‌ర్వాత కొత్తప‌ల్లి మండ‌లంలోని కొన్ని గ్రామాల‌కు మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది. గొల్లప్రోలు ఎక్కువ వ్యవ‌సాయాధారిత ప్రాంతం కావ‌డంతో రైతులు న‌ష్టపోతున్నారు. వాణిజ్య పంట‌లు దెబ్బతింటున్నాయి. ఈబీసీ వంటి లోత‌ట్టు ప్రాంతాలు ఏలేరు వ‌దిలిన‌ప్పుడ‌ల్లా మునిగిపోతున్నాయి. గొల్లప్రోలు నుంచి 7 కిలోమీట‌ర్ల పొడ‌వుతో స‌ముద్రానికి కాలువ ఏర్పాటు చేయాల‌ని ఏలేరు ఆధునికీక‌ర‌ణ అంచ‌నాల‌లో ఉంచారు. కానీ అంచ‌నాలు అమ‌లు కాలేదు. ఏలేశ్వరం నుంచి విడుద‌ల‌య్యే నీరు శివారు ప్రాంతం గొల్లప్రోలుకు చేరుకోవ‌డంతో ప్రతీయేటా వేల ఎక‌రాల్లో పంట న‌ష్టంతోపాటు, ఆస్తి న‌ష్టం సంభ‌విస్తుంది.

పట్టించుకోని జగన్ ప్రభుత్వం..

గ‌తంలో టీడీపీ నేత వ‌ర్మ ప్రభుత్వంపై పోరాడి నిధులు తీసుకురాగ‌లిగారు. కానీ వాటిని వినియోగించ‌డంలో మాత్రం ప్రభుత్వ స‌హ‌కారం లేక‌పోవ‌డంతో ఏలేరు క‌లక‌ల‌గానే ఉండిపోయింది. జ‌గ‌న్ ప్రభుత్వంలో క‌నీసం ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. గొల్లప్రోలు స‌భ‌లో జ‌గ‌న్ రూ.300 కోట్లు ఏలేరు ఆధునీకీక‌ర‌ణ‌కు హమీ ఇచ్చిన‌ప్పటికీ ఇప్పటి వ‌ర‌కూ ఎటువంటి ఫ‌లితం లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందని ఆయా ప్రాంతాల రైతులు ఆశిస్తున్నారు.

Advertisement

Next Story