Gadkari: యుద్ధం అంచున ప్రపంచం.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

by vinod kumar |
Gadkari: యుద్ధం అంచున ప్రపంచం.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచం యుద్ధం అంచున ఉందని, ఈ సమయంలో శాంతిని పెంపొందించడానికి బుద్ధుని తత్వాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nithin gadkaree) అన్నారు. బీహార్‌ (Bihar)లోని బోధ్‌గయా(Bodh gaya)లో ఉన్న మహాబోధి ఆలయంలో (Maha bodhi temple) యునెస్కో (Unesco) వరల్డ్ హెరిటేజ్ ట్రస్ట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు. ‘ఈ రోజు ప్రపంచం పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. యుద్ధం అంచున ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రపంచ శాంతి కోరుకోవాలి. బుద్ధుని బోధనలను అనుసరించాలి’ అని వ్యాఖ్యానించారు. బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన చారిత్రక ప్రదేశాలను హై-క్వాలిటీ, బహుళ లైన్ల రోడ్లతో అనుసంధానం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని నొక్కి చెప్పారు. బుద్ధ సర్క్యూట్‌లోని ప్రముఖ ప్రదేశాలలో బోధ్ గయ ఒకటని, బుద్ధుడికి జ్ఞానోదయం పొందిన ఈ ప్రదేశం ఎంతో ప్రాముఖ్యత పొందిందని కొనియాడారు. బుద్దా సర్క్యూట్‌లో భాగంగా ప్రభుత్వం రూ.22,000 కోట్లతో దాదాపు 1,600 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మిస్తోందని తెలిపారు.

Advertisement

Next Story