Gift: ఉద్యోగులకు టాటా కార్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు.. బహుమతిగా ఇచ్చిన ఆ సంస్థ !

by vinod kumar |
Gift: ఉద్యోగులకు టాటా కార్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు..  బహుమతిగా ఇచ్చిన ఆ సంస్థ !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఏ సంస్థ అయినా తమ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు సాలరీ పెంచడం, బోనస్‌లు, అడ్వాన్స్ లు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. కానీ తమిళనాడు రాజధాని చెన్నయ్‌లోని సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ (Surmount Logistics Solutions Pvt Ltd) అనే సంస్థ మాత్రం తమ ఉద్యోగులకు కార్లు, రాయల్ బైకులను గిఫ్టుగా ఇచ్చింది. బహుమతుల్లో టాటా కార్లు, యాక్టివా స్కూటర్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు ఉన్నాయి. ఉద్యోగులను ఎంకరేజ్ చేయడంలో భాగంగా 20 మందికి వీటిని అందించినట్టు కంపెనీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డెంజిల్ (Denzil) తెలిపారు. ఇది సంస్థ అత్యున్నత లక్ష్యాలను సాధించేందుకు ఎంతో దోహదపడుతుందని వెల్లడించారు.

‘ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల వారిని మెరుగుపర్చడం సాధ్యమవుతుంది. ఈ చర్యలతో ఎంప్లాయిస్‌ను మరింత ప్రోత్సహించొచ్చు. ఫలితంగా ఉత్పాదక కూడా పెరుగుతుంది. ఉద్యోగులు ఉత్తమ పనితీరును కనబరుస్తారు’ అని పేర్కొన్నారు. కాగా, నగరంలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న సుర్‌మౌంట్ లాజిస్టిక్స్ కంపెనీ లిమిటెడ్.. లాజిస్టిక్స్ రంగంలో సరుకుల రవాణా, సరఫరాలో నెలకొన్న సవాళ్లను పరిష్కరిస్తుంది.

Advertisement

Next Story