రోహిత్ అలా ఆడు : హిట్‌మ్యాన్‌కు రవిశాస్త్రి కీలక సూచన

by Harish |
రోహిత్ అలా ఆడు : హిట్‌మ్యాన్‌కు రవిశాస్త్రి కీలక సూచన
X

దిశ, స్పోర్ట్స్ : ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ‌కు భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక సూచన చేశాడు. తాజాగా ఐసీసీ రివ్యూస్‌లో మాట్లాడుతూ.. రోహిత్ ఎటాకింగ్ గేమ్ ఆడాలని సూచించాడు. అలాగే, 6వ స్థానంలో బ్యాటింగ్ కొనసాగించాలన్నాడు. వ్యూహాలను మార్చుకుంటే అతను 6వ స్థానంలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్ అవుతాడని చెప్పాడు. ‘రోహిత్ ఫామ్ అందుకోవడానికైనా, జట్టును గెలిపించడానికైనా ఎటాకింగ్ చేయడమే ఉత్తమమైన మార్గం. ఏం జరిగినా ఆందోళన పడొద్దు. దూకుడుగానే ఆడాలి. అతను బ్యాటింగ్ చేసే స్థానం చాలా కీలకం. వరల్డ్‌లో 6వ స్థానంలో వచ్చే అత్యుత్తమ బ్యాటర్లు ఎటాకింగ్ గేమ్ ఆడతారు. చాలా వికెట్లు పడితే మాత్రం జాగ్రత్తగా ఉంటారు. రోహిత్ ఆ సామర్థ్యం ఉంటే ఆస్ట్రేలియా పరిస్థితుల్లో అన్ని షాట్లు ఆడాలి’ అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.


Advertisement

Next Story