- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PKL 2024 : సెమీస్‌కు అర్హత సాధించిన హర్యానా స్టీలర్స్
దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో హర్యానా స్టీలర్స్ సెమీస్ బెర్త్ సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న హర్యానా ఆదివారం యు ముంబాను ఓడించడం ద్వారా సెమీస్‌కు అర్హత సాధించింది. పాయింట్స్ టేబుల్‌లో టాప్-2 జట్లు నేరుగా సెమీస్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం హర్యానా టాప్ పొజిషన్‌లో ఉన్నది. పుణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో హర్యానా 47-30 తేడాతో యు ముంబాను ఓడించింది. మొదటి హర్యానా స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ జట్టు ఆటగాళ్లు వరుసగా పాయింట్లు తేవడంతో ఫస్టాఫ్‌లో 26-14తో ఆధిక్యంలోని నిలిచి పట్టు సాధించింది. సెకండాఫ్‌లో యు ముంబా పుంజుకున్నప్పటికీ హర్యానా దూకుడును మాత్రం నిలువరించలేకపోయింది. మొత్తంగా యు ముంబా మూడుసార్లు ఆలౌటైంది. హర్యానా రైడర్ శివమ్ 14 పాయింట్లతో సత్తాచాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో తమిల్ తలైవాస్ 42-32 తేడాతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. ఆల్‌రౌండర్ హిమాన్షు(13 పాయింట్లు) రాణించగా.. బెంగళూరు తరపున సుశీల్(15 పాయింట్లు) పోరాటం వృథా అయ్యింది.
- Tags
- #PKL 2024