టీడీపీ సరికొత్త రికార్డు.. 76 లక్షలకు పైగా సభ్యత్వాలు

by srinivas |
టీడీపీ సరికొత్త రికార్డు.. 76 లక్షలకు పైగా సభ్యత్వాలు
X

దిశ, వెబ్ డెస్క్: సభ్యత్వ నమోదులో టీడీపీ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే దేశ రాజధానిలోనూ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతుంది. సదరన్ ట్రావెల్స్ అధినేత ఆలపాటి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఢిల్లీ జన్పథ్ రోడ్డులో ఈ కార్యక్రమం నిర్వహించారు. 'టు గెదర్ ప్రోగ్రెస్, టుగెదర్ విత్ టీడీపీ' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఢిల్లీలోని తెలుగు ప్రజలు ఉత్సాహంగా టీడీపీ సభ్యత్వాలు తీసుకున్నారు. దీంతో ఒక్క రోజులోనే దాదాపు 500 మంది పార్టీ సభ్యత్వం తీసుకుని రికార్డు సృష్టించారు. అటు ఏపీ వ్యాప్తంగా 76 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు అయ్యాయి. దీంతో తెలుగు‌దేశం పార్టీ సరికొత్త రికార్డు సృష్టించిందని నాయకులు పేర్కొన్నారు.

Advertisement

Next Story