Brazil: బ్రెజిల్ రోడ్డు ప్రమాదం.. 41కి చేరిన మృతుల సంఖ్య

by vinod kumar |
Brazil: బ్రెజిల్ రోడ్డు ప్రమాదం.. 41కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రెజిల్‌(Brazil)లో శనివారం తెల్లవారుజామున మినాస్ జెరాయిస్ రాష్ట్ర హైవేపై బస్సు, ట్రక్కు ఢీకొని ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో 41మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. సావో పాలో (Savo palo) నుంచి బహియా (Ohiya) రాష్ట్రంలోని విటోరియా డా కాంక్విస్టాకు వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొని మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు చేపట్టనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. దేశంలో దాదాపు 20 ఏళ్లలో జరిగిన అతిపెద్ద రోడ్డు ప్రమాదం ఇదేనని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డీ సిల్వా స్పందించారు. దీనిని భయంకరమైన విషాదంగా అభివర్ణించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Advertisement

Next Story