Manipur : అరచేతిలో ప్రాణాలు.. అంత్యక్రియలు నిర్వహించేందుకూ వణుకు

by Hajipasha |
Manipur : అరచేతిలో ప్రాణాలు.. అంత్యక్రియలు నిర్వహించేందుకూ వణుకు
X

దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్‌(Manipur)లోని జిరిబామ్(Jiribam) జిల్లా ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ఎంత భయం నడుమ వాళ్లు జీవిస్తున్నారంటే.. తమ వాళ్లు చనిపోతే అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు కూడా హడలిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. నవంబరు 11న కుకీ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి హత్య చేసిన ఆరుగురు మెయితీ వర్గం వారి డెడ్‌బాడీలకు పోస్టుమార్టం పూర్తయింది. అసోంలోని సిల్చార్‌ నగరంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో వారి డెడ్‌బాడీలకు పోస్టుమార్టం జరిగింది. వైద్యాధికారులు పోస్టుమార్టం నివేదికలను కూడా రెడీ చేశారు.

దీనిపై గత రెండు రోజులుగా ఆస్పత్రి నుంచి మృతుల కుటుంబాలకు సమాచారం అందుతూనే ఉంది. అయినా మృతుల కుటుంబాలు ఆ డెడ్‌బాడీలను జిరిబామ్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించేందుకు సాహసించడం లేదు. మణిపూర్ పోలీసులు సెక్యూరిటీ ఇస్తామని భరోసా ఇచ్చినా.. అంత్యక్రియలు జరిపేందుకు వారు ధైర్యం చేయలేకపోతున్నారు. అంత్యక్రియల వేళ జిరిబామ్‌లో మళ్లీ ఎలాంటి హింస జరుగుతుందో అనే భయం మృతుల కుటుంబాలను వెంటాడుతోంది. మణిపూర్‌లో శాంతి భద్రతలు గాడితప్పినప్పటి నుంచి పోలీసు పహారా ఉన్నా అక్కడి ప్రజలు సురక్షితంగా ఫీల్ కాలేకపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed