- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sindhu : చైనా మాస్టర్స్ క్వార్టర్స్ కు లక్ష్యసేన్..ఇంటి ముఖం పట్టిన సింధు
దిశ, వెబ్ డెస్క్ : చైనా మాస్టర్స్ (China Masters) ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ (Lakshya Sen) క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాడు. అయితే ఇండియాకు చెందిన మరో స్టార్ షట్లర్ పి.వి.సింధు (PV Sindhu) ప్రిక్వార్టర్స్ లోనే ఓడి ఇంటి ముఖం పట్టింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్లో లక్ష్యసేన్ 21-6, 21-18తో రాస్మస్ జెమ్కే (డెన్మార్క్)పై విజయం సాధించాడు. వరుసగా గేమ్ ల్లో ప్రత్యర్థిని చిత్తు చేసి 46 నిమిషాల్లోనే మ్యాచ్ని ముగించాడు. మహిళల సింగిల్స్ ప్రిక్టార్టర్స్ లో ప్రపంచ 19వ ర్యాంకర్ అయిన పి.వి. సింధు 16-21, 21-17 21-23తో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో ఓటమి చవిచూసింది.
పురుషుల డబుల్స్ డిఫెండింగ్ చాంపియన్ సాత్విక్, చిరాగ్ శెట్టి జంట కూడా క్వార్టర్స్ కు చేరుకుంది. మహిళల డబుల్స్ గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీ ప్రిక్వార్టర్స్ లో ఓటమిపాలైంది. 16-11, 11-21తో చైనాకు చెందిన లియు షెంగ్ షు. టాన్ నింగ్ జంట చేతిలో ఓటమి చవిచూసింది. ఈ టోర్నీలో భారత యువ షట్లర్లు అనుపమ ఉపాధ్యాయ, మాళవిక బన్సోద్ లు కూడా ఓటమి చెందారు.