Bihar: సీఎం నితీశ్, ప్రధాని మోడీ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం.. బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి

by vinod kumar |
Bihar: సీఎం నితీశ్, ప్రధాని మోడీ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం.. బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఏడాది జరగనున్న బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీశ్ కుమార్ (Nithish kumar), ప్రధాని మోడీ(Pm modi)ల నాయకత్వంలోనే పోటీ చేస్తామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి (Samrat chowdary) స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎటువంటి గందరగోళం లేదని తెలిపారు. ఆదివారం ఆయన ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నితీశ్, మోడీల నేతృత్వంలోనే ఎన్నికల బరిలో నిలుస్తామన్నారు. రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి నితీశ్ సమక్షంలోనే పనిచేస్తోందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నితీశ్ కుమార్‌ను సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించకూడదని బీజేపీ పట్టుపట్టొచ్చని వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు. 2020లో ఎన్డీయే నాయకుడిగా నితీష్‌ కుమార్‌ ఉన్నారని, భవిష్యత్‌లోనూ నాయకుడిగా కొనసాగుతారని చెప్పారు. బిహార్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కాగా, 243 మంది సభ్యులున్న బిహార్ అసెంబ్లీకి 2025 చివరిలో ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story