GST Council: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..!

by Maddikunta Saikiran |
GST Council: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..!
X

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అధ్యక్షతన 55వ జీఎస్టీ కౌన్సిల్(GST Council) సమావేశం శనివారం జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్(Rajasthan)​లోని జైసల్మేర్(Jaisalmer) జరిగిన ఈ మీటింగ్లో వివిధ వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు, తగ్గింపుపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్​ సమావేశం అనంతరం ధరలు పెరిగేవి, తగ్గే వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

ధరలు పెరిగేవి:

  • పాత పెట్రోల్​, డీజిల్​ కార్లు, పాత ఎలక్ట్రిక్ వాహనాలు
  • రెడీ టు ఈట్ పాప్​కార్న్
  • కార్పొరేట్ స్పాన్సర్షిప్ సేవలు
  • ఆటో క్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్ లో 50 శాతం ఫ్లై యాష్ ఉంటే అధిక జీఎస్టీ

ధరలు తగ్గేవి:

  • ప్రజాపంపిణీకి ఉపయోగించే ఫోర్టిఫైడ్ రైస్
  • జన్యు చికిత్సలకు చేసే జీన్ థెరపీ
  • ఎండుద్రాక్ష, మిరియాలు

Advertisement

Next Story