- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Digvijay: జమిలీ బిల్లులు ఆమోదం పొందలేవు.. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
దిశ, నేషనల్ బ్యూరో: వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One nation one election) బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందే అవకాశం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ (Digvijay singh) అన్నారు. మధ్యప్రదేశ్‌లోని మాల్వా జిల్లాలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. జమిలీ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపించారని కానీ అది ఆమోదం పొందుతాయని భావించడం లేదన్నారు. పార్లమెంటు ఆవరణలో బీజేపీ ఎంపీలను రాహుల్ నెట్టివేశారన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాహుల్ పై వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తమని తెలిపారు. బీజేపీ నేతల మధ్యే తోపులాట జరిగిందని, వారే ఒకరిపై ఒకరు పడ్డారని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆలయ-మసీదు వివాదాలు తలెత్తడం ఆందోళనగా ఉందని ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా దిగ్విజయ్ స్పందించారు. హిందూ-ముస్లిం సమస్యలను లేవనెత్తి నాయకులుగా మారాలనుకునే వారికి ప్రధాని నరేంద్ర మోడీ అతిపెద్ద ఉదాహరణ అని అన్నారు. భగవత్ ఇదే విషయాన్ని మోడీకి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. మోహన్ భగవత్ కేవలం ప్రకటనలు మాత్రమే చేస్తారని, ముస్లింలపై దాడులు జరిగినప్పుడు ఆయన మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు.