- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Euthanasia : నడిరోడ్డుపై చితి.. కారుణ్య మరణానికి రైతు డిమాండ్.. రూ. 9.91 లక్షల ఫైన్
దిశ, నేషనల్ బ్యూరో : తన భూమిని తీసుకున్న శ్రీ సిమెంట్ కంపెనీ నుంచి పరిహారం రాకపోవడంతో ఓ రైతు నడిరోడ్డుపై చితిని పేర్చాడు. అందులో తన కుటుంబమంతా సజీవ దహనమయ్యేలా కారుణ్య మరణానికి(euthanasia) అనుమతించాలని పోలీసులకు విన్నవించాడు. చెప్పడంతో ఊరుకోకుండా.. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆ చితిపై కూర్చున్నాడు. డిసెంబరు 10న రాజస్థాన్(Rajasthan)లోని ఝున్‌ఝును జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారుణ్య మరణానికి అనుమతులు కోరిన ఆ రైతు పేరు విద్యాధర్ యాదవ్. ఈ అంశాన్ని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. విద్యాధర్ ఏ క్షణమైనా ఆత్మహత్య చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నందున.. వారి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు పెట్టించాలని పోలీసుశాఖకు సూచించింది. దీంతో డిసెంబరు 10 నుంచి రైతు విద్యాధర్ యాదవ్ ఇంటివద్ద ఒక ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు సహా మొత్తం 99 మంది పోలీసు సిబ్బందికి రాత్రి, పగలు షిఫ్టుల వారీగా డ్యూటీలు వేశారు.
కొన్ని రోజులుగా గడిచాక శ్రీ సిమెంట్ కంపెనీ స్పందించింది. ఆ రైతుకు భూపరిహారంగా రూ.3 కోట్లు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ పరిణామం జరిగిన వెంటనే ఝున్‌ఝును జిల్లా ఎస్పీ నుంచి రైతు విద్యాధర్ యాదవ్‌కు ఒక నోటీసు వచ్చింది. ‘‘ మీ ఇంటి వద్ద రోజుల తరబడి పెద్దసంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించాం. దానివల్ల పోలీసుశాఖపై అదనపు ఆర్థికభారం పడింది. అందుకే మీపై రూ.9.91 లక్షల జరిమానా విధిస్తున్నాం. డిసెంబరు 24లోగా ఈ జరిమానా కట్టకుంటే చర్యలు తీసుకుంటాం’’ అని ఆ నోటీసులో జిల్లా ఎస్పీ ప్రస్తావించారు. జరిమానా చెల్లించే డెడ్‌లైన్ సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో రైతు విద్యాధర్ ఏం చేస్తాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది.