MP Anil Kumar Yadav:అంబేద్కర్ పై అమిత్​ షా వ్యాఖ్యలు దారుణం.. పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే!

by Jakkula Mamatha |
MP Anil Kumar Yadav:అంబేద్కర్ పై అమిత్​ షా వ్యాఖ్యలు దారుణం.. పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ డిక్టేటర్ లా వ్యవహరిస్తుందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. అంబేద్కర్ పై అమిత్​ షా వ్యాఖ్యలు దారుణమన్నారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ను అవమానించడం సరికాదన్నారు. దీనిపై చర్చ జరగాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశా అన్నారు. హౌస్ లో అమిత్ షా మాట్లాడినా తీరు దేశమంతా గమనించిందన్నారు. అంబేద్కర్ పై ఏదో రకంగా బురదజల్లే ప్రయత్నం బీజేపీ చేసిందన్నారు. రాజ్యసభ సభ్యులు అందరూ అప్పుడే దాని తీవ్రంగా ఖండిచామన్నారు. రాజ్యాంగం ఇచ్చిన పవర్ దేశం లో నివసించే ప్రతి ఒక్కరికీ అందాలన్నారు. ఎస్సీ,బీసీ, మైనార్టీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే, బీజేపీ దాన్ని అడ్డుకుంటుందన్నారు.

మిత్ షా వెంటనే భారత దేశ ప్రజలు కి క్షమాపణ చెప్పి పదవి నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ..మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగం మార్పులు చేసుకునే అవకాశం అంబేద్కర్ కల్పించారన్నారు. స్వాతంత్రం పూర్వం ఎందరు పాలించినా.. సమాన హక్కులు ప్రజలకు లేవన్నారు. గొప్ప రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ను అవమానించే విధంగా కేంద్ర హోం మంత్రి మాట్లాడటం సరికాదన్నారు. ఇక సంధ్య థియేటర్ ఘటనలో వాస్తవాలను సీఎం వివరించారన్నారు. మానవత్వంతో ఆలోచించాల్సిన పరిస్థితులు కాంట్రవర్సీ చేస్తున్నారన్నారు. యాక్టర్ గా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారనేది ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని వెల్లడించారు.

Advertisement

Next Story