Bhatti Vikramarka : రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక సింగరేణి : భట్టి విక్రమార్క

by M.Rajitha |
Bhatti Vikramarka : రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక సింగరేణి : భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్ : సింగరేణి కాలరీస్(Singareni Calories) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం, ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బొగ్గు ఉత్పత్తి ద్వారా రాష్ట్ర, దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగ‌రేణి సంస్థ(SSCL) కీలక పాత్ర పోషిస్తూ, రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సింగరేణి వెన్నెముకగా నిలుస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో లక్షల మంది ప్రజలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జీవనాధారంగా ఉన్న సింగరేణిని కేవ‌లం బొగ్గు ఉత్పత్తికే ప‌రిమితం చేయ‌కుండా ఇతర రంగాలలోకి కూడా ప్రవేశించి మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సింగరేణి సంస్థ సుస్థిర భ‌విష్యత్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, శ్రమశక్తిని చాటుతూ సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితమవాలని ఆయన కోరారు.

Advertisement

Next Story