- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Social media:16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఆస్ట్రేలియా పార్లమెంటులో బిల్లు
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కాలంలో సోషల్ మీడియా (Social media) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు దీనిని అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. లేచిన దగ్గరి నుంచి మొదలు కుంటే మళ్లీ నిద్ర పోయే వరకు వివిధ రకాల ప్లాట్ ఫామ్‌లలో మునిగి తేలుతున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ రోజుకో కొత్త యాప్ పుట్టకొస్తుండటంతో చిన్నారులు ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. దీని ద్వారా వారు సామాజిక మాధ్యమాలకు బానిసవడంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా(Australia), బ్రిటన్ (Britan)లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ దేశాల్లో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై బ్యాన్ విధించేందుకు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించిన బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో(Australia Parliment) గురువారం ప్రవేశపెట్టారు.
కమ్యూనికేషన్ల మంత్రి మిచెల్ రోలాండ్ (Michel roland) ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం.. టిక్‌టాక్(Tik tok), ఫేస్‌బుక్ (Face book), స్నాప్‌చాట్ (snap chat), రెడ్డిట్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్(Instagram) వంటి ప్లాట్ ఫామ్‌లో పిల్లలకు అకౌంట్స్ ఉండకూడదు. ఒక వేళ వారు ఖాతా పొందితే 32 మిలియన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. భద్రతను నిర్ణయించే బాధ్యత పిల్లల తల్లిదండ్రులు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపైనే ఉండనుంది. ఈ బిల్లుకు లేబర్ పార్టీ(Labour party), ప్రతిపక్ష లిబరల్ పార్టీ (Libaral party) మద్దతిచ్చింది. ‘సోషల్ మీడియా చాలా మంది ఆస్ట్రేలియన్లకు హానికరం. 14 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లల్లో 66శాతం మంది మాదకద్రవ్యాల వినియోగం, ఆత్మహత్యలు, ఇతర హాని కలిగించే కంటెంట్‌ను చూశారు. ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందుకే సోషల్ మీడియాపై పిల్లలకు నిషేధం విధిస్తున్నాం’ అని మిచెల్ రోలాండ్ తెలిపారు. త్వరలోనే ఈ బిల్లు చట్టంగా మారనున్నట్టు తెలుస్తోంది. వయో పరిమితిని ఎలా అమలు చేయాలనే దానిపై పరిశోధించడానికి ఒక ఏడాది సమయం ఉంటుందని రోలాండ్ తెలిపారు. అయితే ఎడ్యుకేషన్, ఆన్ లైన్ గేమ్, మెసెజింగ్ యాప్స్ ప్లాట్ ఫామ్‌లను మినహాయించిన్టు తెలుస్తోంది. కానీ పరిమితులకు లోబడే వీటిని ఉపయోగించేలా ఆదేశాలు వచ్చే చాన్స్ ఉన్నట్టు సమాచారం.
ఆస్ట్రేలియా బాటలోనే బ్రిటన్ !
ఆస్ట్రేలియా తరహాలోనే యూకే (UK) ప్రభుత్వం కూడా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. బ్రిటన్ టెక్నాలజీ సెక్రటరీ పీటర్ కైల్ (Peetar kail) మాట్లాడుతూ.. యువతపై స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా ప్రభావంపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం ఏం చేయాలో అది చేసి తీరుతామని తెలిపారు. సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎక్కువగా ఉందని చెప్పారు. అయితే దీనిపై బ్రిటన్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆస్ట్రేలియా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో పీటర్ కైల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.