Tragedy: తెలంగాణలో మరో సంచలనం.. మహిళా కానిస్టేబుల్‌తో సహా ముగ్గురు ఆత్మహత్య!

by Shiva |   ( Updated:2024-12-26 01:30:33.0  )
Tragedy: తెలంగాణలో మరో సంచలనం.. మహిళా కానిస్టేబుల్‌తో సహా ముగ్గురు ఆత్మహత్య!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా (Kama Reddy District)లో మహిళా కానిస్టేబుల్ శృతి (Shruthi) చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా అడ్లూర్‌ (Adlur)లోని ఎల్లారెడ్డి చెరువు (Yellareddy Lake)లోకి దూకినట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ముగ్గురి కోసం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సింధు శర్మ (SP Sindhu Sharma) ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా కానిస్టేబుల్ శృతి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు యత్నించిన వారిలో బిక్కనూరు ఎస్సై సాయి కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed