- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maha Kumbh : మహా కుంభమేళాలో మోడీ, యోగిలపై దాడిచేస్తాం.. ఉగ్రవాది పన్నూ వార్నింగ్
దిశ, నేషనల్ బ్యూరో : ఖలిస్తానీ ఉగ్రవాది(Khalistani separatist) గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun) మరోసారి బరితెగించాడు. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు. మహా కుంభమేళా(Maha Kumbh) సందర్భంగా ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగిలపై దాడి చేస్తామన్నాడు. ఈమేరకు బెదిరింపులతో అతడు ఒక వీడియోను విడుదల చేశాడు. చనిపోయిన ఖలిస్థానీ ఉగ్రవాదుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని పన్నూ ప్రకటించాడు. మహా కుంభమేళాలలో షాహి స్నానాలకు శుభప్రదమైన జనవరి 14, 29, ఫిబ్రవరి 3 తేదీల్లో దాడులు చేస్తామన్నాడు. ఆ రోజుల్లో ప్రధాని మోడీ, సీఎం యోగి ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించే అవకాశం ఉందని గురుపత్వంత్ సింగ్ పన్నూ తెలిపాడు. దీనిపై అఖాడా పరిషత్(Akhada Parishad) తీవ్రంగా స్పందించింది. సమాజంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా పన్నూ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంది.
‘‘పన్నూ లాంటి వాళ్లు మహాకుంభ మేళాలోకి అడుగు పెట్టాలని భావిస్తే కాచుకోండి. అలాంటి వాళ్లను తన్ని తరిమేస్తాం. మేం అలాంటి ఉగ్రమూకలను చాలామందిని చూశాం’’ అని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పురి కౌంటర్ ఇచ్చారు. ‘‘మహా కుంభమేళాలో సిక్కులు, హిందువులు కలిసికట్టుగా పాల్గొంటారు. సనాతన సంప్రదాయాలను సజీవంగా ఉంచిన ఘనత సిక్కులదే’’ అని ఆయన చెప్పారు. హిందూ ధర్మంతో పాటు సిక్కులలోనూ నాగా సాధువులు ఉన్నారని మహంత్ రవీంద్ర పురి తెలిపారు. గురుపత్వంత్ సింగ్ పన్నూ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.