- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లో బంగారం చోరీ
by Sridhar Babu |
X
దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒంటరిగా నివసిస్తున్న మహిళ ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారం ఎత్తుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల మే రకు సంతోష్ నగర్ కు చెందిన నీలగిరి విజయ (76) భర్త చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి సుమారు ఒంటిగంటకు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మూడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితురాలి ద్వారా హైదరాబాద్ లో ఉంటున్న ఆమె కొడుకు ప్రవీణ్ విషయం తెలుసుకుని జగిత్యాల పోలీసులను ఆశ్రయించాడు. ప్రవీణ్ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ కిరణ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Advertisement
Next Story