వాట్సాప్ గ్రూప్‌లో ఘరానా మోసం.. అమాయకులే లక్ష్యం..

by Aamani |   ( Updated:2024-12-27 06:04:02.0  )
వాట్సాప్ గ్రూప్‌లో ఘరానా మోసం.. అమాయకులే లక్ష్యం..
X

దిశ,నల్లగొండ: అమాయక ప్రజలే లక్ష్యం గా కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. పోలీసులు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేస్తున్న కానీ బహిరంగంగా నే వాట్సప్ గ్రూపు లో నే దందా చేస్తూ అమాయకులను దండుకుంటున్నారు.వారి మీద కఠిన మైన చర్యలు తీసుకోవాలి.

రూ.రెండు వేలు వేయండి ..రూ.18500 వేస్తాం..:

బీసీ జర్నలిస్టు ఫోరం అనే వాట్సప్ గ్రూప్ లో ఒక వ్యక్తి మొదటగా ఒక అపరిచిత వ్యక్తి గ్రూప్ లో అడ్మిన్ తీసుకొని తనకు సంబంధించిన వ్యక్తి ని గ్రూప్ లో యాడ్ చేసి అడ్మిన్ ఇచ్చి గ్రూప్ అసలు అడ్మిన్ నీ రిమూవ్ చేసి గ్రూప్ అడ్మిన్లు గా వారే ఉంటారు. ఆ తర్వాత హర్ష సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక 20 మందికి రూ.రెండు వేలు మీరు ఇస్తే రూ.18500 మీకు నేను వేస్తాను అని ఒక ఫేక్ అకౌంట్ లో కోట్ల రూపాయల డబ్బు ఉన్నట్లు స్క్రీన్ షాట్ పెడుతారు అలాగే కొంత మందికి డబ్బులు కొట్టిన స్క్రీన్ షాట్ పెడుతారు.

ఇంతలో ఒక వ్యక్తి నేను పోలీస్ సీఐ నీ నాకు డబ్బులు వేసాడు. నేను కూడా డబ్బులు వేసి ఆ డబ్బులు తీసుకున్న పేద వారికి ఇది చాలా ఉపయోగం అని సందేశం వాట్సప్ గ్రూప్ లో పెడుతారు.ఇంకో విషయం ఎవరు ఈ ఆఫర్ మిస్ కాకండి అని పెడుతారు.ఇది ఘరానా మోసం అని తెలిసిన చాలా మంది వారి వలలో చిక్కుకొని డబ్బులు కొట్టి మోసపోతున్నారు.ఎవరైనా వారికి కాల్ చేస్తారు అని వాళ్ళని గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తున్నారు. ఈ గ్రూప్ లో మాదిరిగా వీళ్ళు చాలా మందిని మోసం చేస్తున్నట్లు వారిని చూస్తే తెలుస్తుంది.

ఇలాంటి వారి మీద పోలీసులు తక్షణం చర్యలు తీసుకోవాలి..

నేను పోలీసును అని చెప్పి అటు డిపార్ట్మెంట్ కు తలవంపులు తెచ్చేలా వ్యవహరిస్తున్న ఈ మోసగాళ్ల పై పోలీసు వారు నిఘా వేసి ఎవరు మోసానికి గురి కాకుండా చర్యలు తీసుకోవాలి అని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed