సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీపై పూనమ్ కౌర్ స్ట్రాంగ్ రియాక్షన్.. దుమారం రేపుతున్న పోస్ట్

by Kavitha |   ( Updated:2024-12-27 16:10:53.0  )
సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీపై పూనమ్ కౌర్ స్ట్రాంగ్ రియాక్షన్.. దుమారం రేపుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. గతంలో కొన్ని సినిమాల్లో నటించిన ఈ భామకు అంతగా గుర్తింపు రాకపోవడంతో వాటికి గుడ్ బై చెప్పి సోషల్ మీడియాకే పరిమితమయింది. అక్కడ స్ట్రాంగ్ పోస్టులు పెడుతూ నెట్టింట రచ్చ చేస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి, డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ఇన్‌‌డైరెక్ట్(కొన్ని సార్లు డైరెక్ట్) పోస్ట్‌లతో నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తు ఉంటుంది. ఈ క్రమంలో మరో సారి తన పోస్ట్‌తో వార్తల్లో నిలిచింది పూనమ్ కౌర్.

మహిళలెవరూ సీఎం సమావేశానికి వెళ్లేంత ముఖ్యమేం కాదంటోంది పూనమ్‌ కౌర్‌. ఈ మేరకు పూనమ్‌ కౌర్‌ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. ‘సీఎంతో సమావేశానికి మహిళలెవరూ కూడా ముఖ్యమైన వ్యక్తులుగా పరిగణించబడలేదు. ఎందుకంటే మహిళలకు ఎలాంటి సమస్యలుండవు. వ్యాపార సంబంధ విషయాలు, హీరోకు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం పరిశ్రమ నిలబడుతుంది. కానీ మహిళలెవరకీ సమస్య ఉండదు’ అంటూ తనదైన స్టైల్‌లో గట్టిగా ఇచ్చిపడేసింది పూనమ్ కౌర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు సినీ ప్రముఖులతో భేటీని ఉద్దేశించే పూనమ్ ఈ వ్యాఖ్యలు చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Read More ...

Samantha: హ్యాపీ హాలిడేస్ అంటూ సమంత పోస్ట్.. టేక్ కేర్ సామ్ అంటున్న నెటిజన్లు


Advertisement

Next Story

Most Viewed