- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India Trade: రెండు దశాబ్దాల్లో గ్లోబల్ ట్రేడ్‌లో భారత వాటా రెట్టింపు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ వాణిజ్యంలో భారత వాటా గణనీయంగా పెరిగిందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) పేర్కొంది. గడిచిన రెండు దాశాబ్దాల కాలంలో ప్రపంచ వాణిజ్యానికి భారత సహకారం గణనీయంగా పుంజుకోగా, ఎగుమతులు, దిగుమతులు రెండింటిలోనూ రెండింతలు పెరిగిందని తన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ సరుకుల ఎగుమతుల్లో భారత వాటా 2005లో 0.9 శాతం నుంచి 2023లో 1.8 శాతానికి పెరిగిందని, సేవల ఎగుమతుల్లో ఇది 2 శాతం నుంచి 4.3 శాతానికి రెట్టింపు పెరిగిందని తెలిపింది. మొత్తంగా ఎగుమతి వాటా 2005లో 1.2 శాతం నుంచి 2023లో 2.4 శాతానికి పెరిగింది. ఈ వృద్ధికి బలమైన వాణిజ్య ఒప్పందాలు, భిన్నమైన ఎగుమతి పోర్ట్‌ఫోలియో, మెరుగైన లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం, మేక్ ఇన్ ఇండియా ప్రచారం, ప్రభుత్వ చొరవ వంటి అంశాలు దోహదపడ్డాయి. వస్తువుల కంటే సేవల ఎగుమతుల్లో భారత సత్తా అధికంగా ఉంది. సరుకుల ఎగుమతుల్లో ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానంలో ఉంటే, సేవల విభాగంలో ఏడవ స్థానంలో ఉంది. అదేవిధంగా ప్రపంచ దిగుమతుల్లో కూడా భారత్ వాటా పెరిగింది. సరుకుల దిగుమతులు 2005లో 1.3 శాతం నుంచి 2023లో 2.8 శాతానికి, సేవల దిగుమతులు 2.4 శాతం నుంచి 3.4 శాతానికి పెరిగాయి. మొత్తంమీద ఈ కాలంలో ప్రపంచ దిగుమతుల్లో భారత్ వాటా 1.5 శాతం నుంచి 2.9 శాతానికి చేరుకుంది. అయితే, గడిచిన దశాబ్దంలో(2014-24) ఎగుమతుల వృద్ధి గణనీయంగా తగ్గింది. ప్రపంచ డిమాండ్, వాణిజ్య సమస్యలు, కొవిడ్-19 మహమ్మారి, భౌగోళిక రాజకీయ పరిస్థితుల వంటి కారణాలతో ఏటా 3.3 శాతానికి నెమ్మదించాయని ఎన్ఎస్ఈ నివేదిక పేర్కొంది.