Allu Arjun: అల్లు అర్జున్‌కు దక్కని ఊరట.. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

by Shiva |   ( Updated:2024-12-27 16:00:45.0  )
Allu Arjun: అల్లు అర్జున్‌కు దక్కని ఊరట.. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట (Stampede) ఘటన కేసులో A11గా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇవాళ నాంపల్లి కోర్టు (Nampally Court)లో వర్చువల్‌ (Virtual)గా విచారణకు హాజరయ్యారు. కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ గడువు నేటితో ముగుస్తుండటంతో తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) నుంచి తనకు మధ్యంతర బెయిల్ (Interim Bail) మంజూరైందని విచారణ సందర్భంగా అల్లు అర్జున్ (Allu Arjun) కోర్టుకు విన్నవించారు. అదేవిధంగా ఇప్పటికే ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. ఇవాళ ఆ పిటిషన్‌పై మెజిస్ట్రేట్ విచారణ చేపట్టారు. అయితే, కేసులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (Public Prosecutor) మరికొంత సమయం కావాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో ఆయన కేసు తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు.

Read More ...

Allu Arjun: వర్చువల్‌గా కోర్టుకు హాజరుకానున్న అల్లు అర్జున్.. అసలు విషయం అదే!


Next Story

Most Viewed