- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Big Breaking News : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

దిశ, వెబ్ డెస్క్ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Former PM Manmohan singh) తుది శ్వాస విడిచారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కన్నుమూశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం తీవ్రంగా విషమించి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్ లో చేర్పించారు. కాగా 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ఈ ఏడాది ప్రథమంలో రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు.
మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్ (ప్రస్తుత పాకిస్తాన్) లోని కోహ్లీ కుటుంబంలో జన్మించారు. 1952 లో బ్యాచ్ లర్ డిగ్రీ పూర్తి చేసి, 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్న సమయంలో, ఆర్థిక మంత్రిగా పని చేశారు మన్మోహన్ సింగ్. ఆ సమయంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వంటి అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రపంచానికి భారత్ ఆర్థిక వ్యవస్థను ఓపెన్ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన హయాంలో ఆర్థిక పరంగా భారత్ మంచి విజయాలు సాధించింది. దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ సింగ్ ఒకరిగా నిలిచారు.
Read More..
Breaking: 9.51 నిమిషాలకు మన్మోహన్‌సింగ్ కన్నుమూత.. ధృవీకరించిన ఎయిమ్స్