రాజీవ్ యువ వికాసం పథకంను వినియోగించుకోండి

by Sridhar Babu |
రాజీవ్ యువ వికాసం పథకంను వినియోగించుకోండి
X

దిశ,మహబూబాబాద్ టౌన్ : రాజీవ్ యువ వికాసం పథకంను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఆదివారం సాయంత్రం సంబంధిత అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించిందని, ఈ పథకం కింద అర్హులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించడానికి 2024-25 ప్రణాళికను ఆమోదించిందని తెలిపారు.

ఇందులో వ్యవసాయ అనుబంధ పథకాలు, పశుపోషణ పథకాలు, ఉద్యానవన పథకాలు, వాణిజ్య వ్యాపార పథకాలు, రవాణా రంగం పథకాలు ఉన్నాయని, జిల్లాలో అర్హత ఆసక్తి గల వారు ఆన్ లైన్ పోర్టల్ https://tgobmmsnew.cgg.gov.ఇన్ ద్వారా అధార్ కార్డు కార్డు/ఫుడ్ సెక్యురిటీ కార్డు, వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం (తెలంగాణ ప్రభుత్వముచే జారీ చేయబడిన), డ్రైవింగ్ లైసెన్సు (ట్రాన్స్పోర్ట్ సెక్టార్), పట్టదార్ పాస్ పుస్తకం (అగ్రికల్చర్ సెక్టార్), సదరం సర్టిఫికెట్ (వికలాంగులు కొరకు), పాస్ పోర్ట్ సైజు ఫొటోతో ఏప్రిల్ 5వ తేదీ లోపు మీసేవలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన తర్వాత జిరాక్స్ ప్రతులను సంబంధిత కార్యాలయాలలో సమర్పించాలన్నారు.

ఈ పథకానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఐడీఓసీ మహబూబాబాద్, ఎంపీడీఓ / మున్సిపాలిటీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి ఈ పథకంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్​లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, డీఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు నరసింహస్వామి, శ్రీనివాసరావు, దేశి రామ్ నాయక్, శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ పురుషోత్తం పాల్గొన్నారు.

Next Story

Most Viewed